
రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని ఏఈఓ మనిషా అన్నారు.మండలంలోని మల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీ పని చేస్తున్న రైతుల వద్దకు మంగళవారం వ్యవసాయ విస్తరణ అధికారి మనీషా వెళ్లి రైతులకు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని అవగాహనా కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన ఆదికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. బిజి-3 పేరుతో చలామణి అవుతున్న హెచ్ టి పత్తి విత్తనాలకు జిఈఏసి అనుమతి లేనందున ఈ రకం విత్తనాలను కొనడం, అమ్మడం సాగు చేయడం నేరమన్నారు.నిర్ణీత ఫార్మాట్ లో ఉన్న బిల్లు (రసీదు) దుకాణదారుని అడ్రస్ పేరు సీడ్ లైసెన్స్ నంబరు జిఎస్టి నంబరు మొదలగునవి ఉన్న రసీదును మాత్రమే రసీదుగా అంగీకరించాలన్నారు.కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసీదు పై విత్తన కంపెనీ పేరు విత్తన రకంపేరు, లాట్ నెంబరు,గడువు తేదీ మరియు డీలర్ సంతకము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని,లూజుగా ఉన్న సంచులు,పగిలిన ప్యాకెట్లు డబ్బాల్లో ఉన్న విత్తనాలను,గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు అవగాహనా కల్పించారు.