జూన్‌ 10న చలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం

– ఉపాధి కూలీలకు ప్రతి రోజూ కూలి రూ. 600లు ఇవ్వాలి
– వ్యకాస ఆరుట్ల గ్రామ కార్యదర్శి అనంగళ్ళ అశోక్‌
– ఆరుట్లలో ఉపాధి హామీ చట్టం పనులు పరిశీలన
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్‌
ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న కూలీలకు ప్రతి రోజూ కూలి రూ. 600లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆరుట్ల గ్రామ కార్యదర్శి అనంగళ్ళ అశోక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలకు రోజు కూలీ గతంలో కంటే రూ.28 లు మాత్రమే పెంచి, గొప్పలు చెప్పుకోవడంతో పాటు, పనిలో అదనంగా కొలతలు కూడ పెంచారనీ, ఈ కొలతల గురించి చెప్పకపోవడం గమనార్హం. కూలీలకు రూ.300 నుంచి రూ.600లు పెంచాలని కరువు ఉన్న రోజుల్లో 150 రోజులు పని కల్పించాలన్నారు. వృద్ధులు, వికలాంగులకు కూడా పని కల్పించాలన్నారు. మేట్ల వ్యవస్థను పునరుద్ధరించాలనీ, సీనియర్‌ మేట్లను ఎఫ్‌.ఏలు నియమించాలన్నారు. ఎఫ్‌.ఏలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి, రూ.26 వేల వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కావున జూన్‌ 10న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు కూలీలు, మేట్లు, ఎఫ్‌ఏలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Spread the love