ధూమపానం ఆరోగ్యానికి హానికరం

– కామినేని హాస్పిటల్స్‌ కన్సల్టెంట్‌
– వైద్యులు శ్రీకృష్ణ రాఘవేంద్ర బొడ్డు
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని కామినేని హాస్పిటల్స్‌ (ఎల్బీ నగర్‌) కన్సల్టెంట్‌ వైద్యులు శ్రీకృష్ణ రా ఘవేంద్ర బొడ్డు తెలిపారు. వాపింగ్‌ (ఈ సిగరెట్‌) కూడా ప్రమాదకరమేనని పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు.. ఈ సమాజంలో ప్రబలంగా ఉన్న ఈ రెండు అల వాట్లు అని, ఇవి వ్యక్తుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయన్నారు. యువతలో వాపింగ్‌ అలవాటుగా మారిందన్నారు. దీర్ఘకాలిక ప్రభావాలను అర్థం చేసుకోకుండా పురుషులు, స్త్రీలు వాడుతున్నారన్నారు. ధూమపానం అలవా టు ఉన్న వ్యక్తులు వాపింగ్‌ను మంచి ప్రత్యామ్నాయంగా చూస్తున్నా రన్నారు. శాస్త్రీయ అధ్యయనాలు పరిశీలిస్తే వాపింగ్‌, ధూమపానం రెండూ ఆరోగ్యానికి హానికరమేనన్నారు. వాపింగ్‌ (ఈ సిగరెట్లు) అనేవి సురక్షితమైన ప్రత్యామ్నాయమని వాదిస్తు న్నారని తెలిపారు. అయితే, వాపింగ్తో ఊపిరితిత్తులలో మంట, చికాకు, ఆర్గాన్‌ డ్యామె జ్తో పాటు వ్యసనానికి కారణం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. దీర్ఘకాలిక ప్రభావాలు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదన్నారు. ఊపిరితిత్తులకు పంపిణీ చేసే డయాసిటైల్‌, భారీ లోహాలు, అస్థిర కర్బన సమ్మేళనాలు (వీవోసీలు) వంటి వాపింగ్‌ కోసం ఉపయోగించే పదార్థాల నుంచి హాని కలుగుతున్నట్టు రుజువులు ఉన్నాయన్నారు. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా.. నికోటిన్‌కు దూ రంగా ఉంటూ, వాపింగ్‌కు దగ్గరగా ఉంటూ నెమ్మదిగా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ఇది సురక్షితమైన ఎంపిక అని తమ ఎంపికను సమర్థించు కుంటున్నారని వాపోయారు.
పొగాకు పొగలో ఆరు వేలు కంటే ఎక్కువ రసాయ నాలు ఉంటాయన్నారు. ఇవి విషపూరితమైనవి, క్యాన్సర్‌ కారకమైనవి అన్నారు. ధూమపానం గుండె జబ్బులు, స్ట్రోక్‌, క్రానిక్‌ అబ్స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ), వివిధ రకాల క్యాన్సర్‌లకు దారితీస్తుం దన్నారు. ఇది శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుందన్నారు. రెస్పిరేటరీ రీసెర్చ్‌’లో సంప్రదాయ సిగరెట్‌ల కంటే ఈ సిగరెట్లు తక్కువ హానికరం అన్నారు. అయినప్పటికీ అవి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయన్నారు.

Spread the love