ప్రభుత్వం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు చైర్మెన్‌ను నియమించాలి

– నాయి బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జీ.నవనీత
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు చైర్మెన్‌ను, పాలకమండలిని నియమించాలని నాయి బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జీ.నవనీత అన్నారు. బుధవారం కోఠిలోని కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రె స్‌ ప్రభుత్వం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు చైర్మెన్‌, పాలకమండలం నియమించాలని సీఎం రేవంత్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులకు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో, పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న బార్బర్‌ పోస్టులను భర్తీ చేయా లని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో ఉన్న ఆయా దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తలనీ లాల టెండర్లలో నాయి బ్రాహ్మణులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. వేములవాడ, కొం డగట్టు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ కట్ట ల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు, మహిళల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నా రు. వేములవాడ, భద్రా చలం, రామప్ప, గద్వాల, కొండ గట్టు, బాసర, ధర్మపురి, కాలేశ్వరం, బాస ర, నల్గొండ చెరువు గట్టు, ములుగు మేడారం సమ్మక్క సారలమ్మ, కొత్తగట్టు మహబూబ్‌నగర్‌ మన్యంకొండ, జనగామ కొమరవెల్లి, లక్ష్మీ నరసింహస్వామి, తదితర దేవాలయాల్లో ఉన్న కళ్యాణ కట్టల్లో ఖాళీగా ఉన్న నాయి బ్రాహ్మణ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆయా దేవాలయాల్లో ధర్మకర్తల మండలి లో సభ్యులుగా నాయి బ్రాహ్మణుల కు అవకాశం కల్పించాల న్నారు. నాయి బ్రాహ్మణ మహిళలకు బ్యూటిషన్‌లో శిక్షణ ఇచ్చి ప్రభుత్వం రుణాలు అందించాలన్నారు. యాదగిరిగుట్ట కళ్యాణకట్టులో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణ మహిళల ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. త్వరలోనే మంత్రులను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేస్తామన్నారు.

Spread the love