పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి

– ఆస్టర్‌ ప్రైమ్‌ ఆస్పత్రి
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆస్టర్‌ ప్రైమ్‌ ఆస్పత్రి రీజనల్‌ సీఈఓ కేటీ దేవానంద్‌ అన్నారు. బుధవారం కేఎల్‌ఎన్‌ యాదవ్‌ పార్క్‌ లో అమీర్‌ పేట ఆస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌ సిబ్బంది, కేఎల్‌ఎన్‌ యాదవ్‌ పార్క్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ వారు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సహకారంతో మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్క్‌ సంరక్షణకు పాటు పడుతున్న పార్క్‌ వాకర్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు రమేష్‌గౌడ్‌ను హాస్పిటల్‌ సిబ్బంది ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేటీ దేవానంద్‌ మాట్లాడుతూ నానాటికీ పెరిగిపోతున్న పట్టణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలను పెంచడమే సరైన పరిష్కారమ న్నారు. అంతే గాకుండా నాటిన మొక్కలను సరైన రీతిలో సంరక్షించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అప్పుడే నాటిన మొక్కలు వక్షాలుగా మారి ఫలాలను అందించే స్థాయికి చేరుతాయని చెప్పారు. ఈ విషయంలో వాకర్స్‌ అసోసి యేషన్‌ సభ్యులు చేస్తున్న కషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో వారు చేస్తున్న పనులకు ఆస్టర్‌ ప్రైమ్‌ ఆస్పత్రిమద్దతు ఉంటు ందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఆస్టర్‌ డీఎం హెల్త్‌ కేర్‌తో పాటూ ఆస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌ బిజినెస్‌ హెడ్‌ రవి కుమార్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love