హొహొ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియా దేశాలలో అతిపెద్ద దేశంగా ఉంది. రాజధాని బీజింగ్.హొచైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార పార్టీ. జనాభా విషయంలో ఇండియా తర్వాతహొ140 కోట్లతో,హొజిడిపిలోహొహొఅమెరికా తర్వాత,హొవైశాల్యంలో రష్యా తర్వాత రెండో స్థానంలో ఉంది. చైనా మొత్తం 33 భాగాలుగా, అవి 22 ప్రావిన్స్‌లు,హొ5 స్వయం ప్రతిపత్తి కలిగిన భూ భాగాలు, 4 మున్సిపాలిటీలు, 2 స్వయంపాలిత ప్రాంతాలుగా విభజింపబడి ఉంది.హొఎంతో పురోగతి సాధించినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి.
చైనా చూడడానికిహొ31 మంది సభ్యులు గల మా బృందం మే 6వ తేదీ రాత్రి 11.30 హైదరాబాద్ నుండి బయలుదేరి 5 గంటల తర్వాత సింగపూర్ చేరాం. చైనా, సింగపూర్ లలో సమయం మనకన్నా రెండున్నర గంటలు ముందుంటుంది కాబట్టి వెళ్లేసరికి ఉదయం 7.30 అయింది. 8.30 కే బీజింగ్ విమానం. పరుగులతో వెళ్లాం. మధ్యాహ్నం 2 గంటలకు బీజింగ్ చేరాం. చైనాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలా కచ్చితంగా ఉంటారు. బయటకు రావడానికి రెండు గంటలు పట్టింది. చైనాహొయువకుడు లియో గైడ్‌గా మమ్మల్ని కలుసుకుని ఎక్కువ సమయం లేదు కాబట్టి బీజింగ్ నగరంలోని ఒక పురాతన గ్రామానికి తీసుకు వెళ్ళారు. బొమ్మరిల్లు వంటి చిన్న చిన్న ఇళ్ళు, చిన్న వీధులతో ఎంతో శుభ్రంగా ఉంది. ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసి రూమ్‌కి వెళ్ళిపోయాం.
మొదటి రోజు ఉదయం గంటన్నర ప్రయాణంచేసి ప్రపంచంలోని అతి పెద్దహొహొకూడళ్లలో ఒకటైన తియానన్మెన్ స్క్వేర్ దగ్గరకు వెళ్ళాం. 1989లో జరిగినహొదుర్ఘటనను గురించి గైడ్ చెప్పాడు. చైనాలోని అన్ని నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువ కావడం వలన పార్కింగ్ చాలా కష్టం. ఎక్కువసేపు ఉండనివ్వరు. బస్ నుండిహొత్వరగా దింపేసి వెళ్ళి ఎక్కడో పెట్టుకుని రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తారు. చాలా దూరం నడవాల్సి వచ్చింది. రాజధాని కావడం, చైనాహొఅధ్యక్షుడు, ప్రధాన అధికారులు ఉండే ప్రదేశం కాబట్టిహొహొనిఘా ఎక్కువ.హొప్రజా నాయకుల, చైర్మన్ మావోహొస్మారక చిహ్నాలయిన భవనాలు, నేషనల్ మ్యూజియం, తియానన్మెన్ గేట్ వంటివి ఉన్న ముఖ్యప్రదేశాలు.
అన్నీహొదూరం నుండిహొచూస్తూహొపీపుల్స్ రిపబ్లిక్ చైనా స్థాపనకు మూల కారకుడు, సిద్ధాంత, రాజకీయ వేత్త మావో ముసోలియంహొవద్దకు వెళ్ళాం. అప్పటికే అనేక మంది స్థానిక ప్రజలు, యువకులు ఎక్కువగా విద్యార్థులు ఉదయం పదింటికే కిలోమీటర్ల మేర పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు . చాలా సమయం పట్టింది లోపలికి వెళ్ళడానికి. మౌనంగా, ఉద్విగ భరిత వాతావరణంలో ప్రజా నాయకుడు మావో శరీరాన్ని చూశాం.హొఫొటో తీయడం నిషేధం.హొమనం పుస్తకాలలోహొచూసే మావో ముఖంలాగే ఉంది,హొపోలికలు కూడా మారలేదు. ముఖానికిహొనారింజ రంగు వెలుగు పడేలా చేశారు. చదివిన చైనా పోరాట సాహిత్యం, ఆయనహొసందేశాలుహొగుర్తుకుహొవచ్చాయి. సందర్శకులలోహొచాలా మంది పసి పిల్లలు, నడవలేని పండు ముసలివారు ఉండడం, వాళ్ళకుహొచూడాలని ఉన్నా, పెద్దవాళ్ళను ఓపికగాహొతీసుకొచ్చి చూపించే యువతను చూస్తేహొఆశ్చర్యం అనిపించింది. వీరిని వీల్‌చైర్‌లో తీసుకుని వచ్చిన వారిని వేరే ద్వారం నుండి కొద్దిగా ముందు పంపిస్తున్నారు. ఎక్కువ మంది పూలు ఉంచి మావోని చూస్తూ నడిచి బయటకు వస్తున్నారు.
అక్కడనుండిహొబీజింగ్‌కుహొగుండెహొఅని చెప్పుకోదగిన, జాగ్రత్తగా కాపాడుకుంటున్న పురాతన నగరం.. ఫర్ బిడెన్ సిటీ (నిషేధిత నగరం) కి వెళ్ళాం. యునెస్కో వారిచేహొహొగుర్తింపు పొందినహొసాంస్కతిక వారసత్వ సంపద. ఐదు వందల సంవత్సరాల కిందట దాదాపు అయిదు వందల ఏళ్ళు పరిపాలించిన మింగ్ రాజ వంశస్తులు, వారి ఉద్యోగులు నివసించిన కోట, నివాసం. అప్పట్లోహొప్రజలకు లోపలికి వెళ్ళడానికి అనుమతి నిషేధం. అందుకే ఆ పేరు వచ్చింది. ఇప్పుడు టికెట్‌తో చూడడానికి అందరినీ అనుమతిస్తున్నారు. అందమైన రంగులతో పెద్ద పెద్ద ద్వారాలు, గోపురాలతో, 178 ఎకరాల్లో 9000 గదులతో కూడిన రాజప్రాసాదం చెక్కు చెదరకుండా ఉంది.హొగదుల లోపలికి అనుమతి లేదు. మధ్యలోహొఆ కాలంలో సైనికులు కవాతు చేసే పెద్ద ఖాళీ స్థలం ఉంది. చుట్టూ అందమైన గులాబి తోటలు పెంచి ఆహ్లాదకరంగా తీర్చి దిద్దారు. ఇక్కడికి ఏటా కోటిన్నర మందిహొపర్యాటకులు వస్తూ ఉంటారు.
సాయంత్రంహొథియేటర్‌లో రాజరిక కళారూపం చూశాం.హొఒక రాణిహొహొఅధికారానికి గుర్తు అయినహొగోల్డెన్ మాస్క్ ముఖానికి ధరించి, తన తర్వాత ఆ మాస్క్‌ను అర్హత కలిగిన వారికి ఇవ్వడం అనేది ప్రధాన అంశం. 200 మంది కళాకారులు సంగీతం, నాట్యం, మెరిపించే ఆహార్యంతో,హొహొగాలిలో చేసే అద్భుతహొవిన్యాసాలతో చేయడంహొచూస్తూంటే కళ్ళు తిప్పుకోలేం. కథలో భాగంగా వరద వచ్చినప్పుడు నిజంగా స్టేజ్ మీద, ముందు కూడా నీరు ఉధతంగా వచ్చి మన ముందు నేలంతా తడిచి పోవడం భలేగా ఉంటుంది.
బీజింగ్ నగరం మొత్తం ప్రణాళిక ప్రకారం చెట్లు పెంచి చాలా చక్కగా ఉంది. ప్రతి కూడలి దగ్గరా రంగు రంగుల పూల మొక్కలు, రహదారి పొడవునాహొకిలోమీటర్లహొహొమేరకు పెద్ద పెద్ద గులాబీ మొక్కలు పెంచారు.హొరోడ్ల పక్కన పెద్ద చెట్లు పెంచి, వెళ్ళే ఎతైన వాహనాలకు అడ్డుహొరాకుండా దాదాపు పది అడుగుల వరకు కొమ్మలుహొహొకత్తిరించి నిటారుగా, పైన గుబురుగా నీడ కోసం పెంచడంహొచూస్తేహొప్రతి చెట్టు గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో తెలుస్తుంది. సైకిల్ వాడకం ఎక్కువ. చిన్న బ్యాటరీ తో నడిచే తేలికపాటి స్కూటీహొహొవంటివి విపరీతంగా ఉపయోగిస్తున్నారు.హొఎంత వెతికినా బీజింగ్‌లో పాతబడినహొబస్ ఒక్కటి కూడా కనిపించలేదు. వేలకొద్దీహొఎలెక్ట్రిక్ కార్లు, బస్‌లు, తిరుగుతున్నాహొట్రాఫిక్ జామ్, పెద్ద వాహనాల ధ్వనిహొహొఉండదు. నిదానంగా వెళుతూ కాలుష్య నివారణకు ఇవి చాలా ఉపయోగ పడుతున్నాయి.
నగరం దాటి బయటకు వస్తే మన దగ్గర హైవే మీదకు వచ్చినట్లే. బస్ కూడా గంటకు 130 కి.మీ పైగా వేగంతో వెళుతుంది. సీటు బెల్ట్‌హొతప్పకుండా పెట్టుకోమని చెబుతారు. అక్కడ కూడాహొహొరోడ్ల పక్కన చెత్త, ప్లాస్టిక్ కవర్లు వంటివి ఎక్కడా కనపడవు. బస్‌లోనే డస్ట్‌బిన్‌లు ఉండడం డ్రైవర్ మాటిమాటికీ బస్ శుభ్రం చేయడం కొత్తగా అనిపించింది. ఒక్కొక్క దగ్గర పది, పదిహేనుహొఫ్లై ఓవర్లు పై నుండి కిందనుండి వెళ్ళడం చూస్తూంటే జరిగిన అభివద్ధి తెలుస్తుంది. ఏ దేశమైనా తన ప్రజలకు ఇబ్బంది లేకుండా, సమయం వధా కాకుండా, ఆ సమయాన్ని ఉత్పత్తిలో భాగంగా చేస్తే దేశం ఎలా అభివద్ధి సాధిస్తుందో చూడొచ్చు.
రెండవ రోజు ఉదయం బీజింగ్ నుండి రెండు గంటలు ప్రయాణం చేసిహొగ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గరకు వెళ్ళాం. కొంత దూరం పైకి నడిచి, కేబుల్ కార్‌లో పైకి వెళ్ళి మరికొన్ని మెట్లు ఎక్కితే చైనా వాల్ మీదకు వెళతాం. 21 వేల కిలోమీటర్లు పొడవుతో ఉత్తర చైనాకు రక్షణగా అభేద్యంగా ఉంది. క్రీ.పూ 220 లో క్విన్ షి హువాన్ పాలనలో శత్రువుల దాడుల నుండి కాపాడుకోవడానికి రక్షణ కోసం అంతకు ముందున్న కోటలను కలుపుతూ సాగిన నిర్మాణం వందల సంవత్సరాలు కొనసాగుతూ వచ్చింది. గోడపైకిహొహొవెళ్ళి చూస్తే అనంతమైన అడవులు, పచ్చదనం, ఆకాశం చాలా బాగుంది. మానవుడు ఇంత శక్తిమంతుడా అనిపిస్తుంది. కొద్దిగా వర్షం, చలిగాలితో ఎక్కడం, దిగడం, గోడపై కొంచెం ఇబ్బంది అనిపించింది.
కిందికి దిగి వచ్చాక స్థానిక రెస్టారెంట్‌లో భోజనం. ఎక్కువ మాంసాహార పదార్థాలు ఉన్నాయి. మేం తీసుకువెళ్లిన పచ్చళ్ళు, పొడులతో బాగానే తిన్నాం. మంచిదిహొకాక పోయినా భోజన సమయంలో ప్రతి టేబుల్‌పై కోకాకోలా వంటి కూల్‌డ్రింక్ బాటిల్స్ తప్పకుండా పెడతారు. చైనా ప్రజలు భోజన ప్రియులు. వర్షం వలన కొన్ని చూడలేక పోయాం. సాయంత్రం ఒలింపిక్స్ జరిగినహొహొపక్షి గూడు ఆకారంలో ఉన్నహొహొహొనేషనల్ స్టేడియం,హొహొవాటర్ స్పోర్ట్స్ కోసంహొహొప్రత్యేకంగా నిర్మించిన చతురస్రాకారంలో ఉన్న వాటర్ క్యూబ్‌ను బయటనుండే చూసాం. చైనా జనానికి బద్దకం లేదు. ప్రధాన రోడ్లపై కూడా పరుగెడుతూ, కనపడతారు. ఎయిర్ పోర్టులో కూడాహొహొవ్యాయామం చేస్తున్నారు. కొన్ని చోట్ల పిల్లలు కూడా ఖాళీగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కదిలిస్తూ కనిపించారు. ఇక్కడహొహొఅలా చేస్తూ కనపడితే నవ్వుతారు మనవాళ్ళు.
మూడో రోజు టెంపుల్ ఆఫ్ హెవెన్ అనే దేవాలయం చూసాం. ప్రజల క్షేమం, మంచి పంటలు పండాలనిహొప్రార్థన చేసే ప్రదేశం. తమ కతజ్ఞతలు తెలియచేస్తూ రాబోయే సంవత్సరం బాగుండాలని ప్రార్థిస్తారు. నాలుగు వైపులా పెద్ద ద్వారాలతో విశాలమైన ప్రాంగణంలో ఎత్తు మీద మూడు అంతస్తులుగా కనిపించే గోపురాలతో, దేవాలయం లోపలిపై భాగం అద్భుతమైన చిత్రాలతో నిండి కళాత్మకంగా ఉంది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటా, రెండు గంటలు సమయం పడుతుంది. మధ్యాహ్నం స్టేషన్‌కు వెళ్ళి బుల్లెట్ ట్రైన్‌లో షియాన్ కు బయలు దేరాం.
బుల్లెట్ ట్రైన్ అనుభవం కూడా చాలా బాగుంది. విమాన ప్రయాణానికి పట్టినంత సమయమే పడుతుంది. మరింత అందుబాటులో ఉంది. చైనాలో బుల్లెట్ ట్రైన్ 550హొనగరాలను కలుపుతూ, 45000 కిలోమీటర్లహొప్రయాణం చేస్తూ సమయాన్ని ఆదా చేస్తుంది.హొగంటకు 360 కి.మీ. వేగంతోహొహొనడుస్తుంది. ఎంత వేగంతో వెళుతుందో, రాబోయే స్టేషన్‌హొహొఏదో ముందుగానే లోపల తెలిపే వీలుంది. అక్కడ యువత, ఉద్యోగస్తులు విపరీతంగా వినియోగించుకుంటున్నారు. టూరిస్టులకు కూడా చాలా ఉపయోగం. కాకపోతే స్టేషన్‌లో మూడు నిమిషాలకు మించి ఉండదు. లేట్ చేసి దిగలేకపోతే గంటా రెండు గంటలకు తర్వాత వచ్చే స్టేషన్‌లో దిగి రావాలి. మన దగ్గర ఉన్న లగేజీతో 30 మంది దిగడంహొహొచాలా కష్టం. ఎక్కువ మంది చురుగ్గా ఉండడం, అందరి లగేజ్ వాళ్లే దింపడం వలన తేలికగా దిగి ఊపిరి పీల్చుకున్నాం.
ఈ ట్రైన్ ప్రయాణం చాలా సరదాగా ఆనందంగా సాగింది. దారిపొడవునా పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, గ్రామాలు, ఎంత చిన్న ప్రదేశానికైనా చక్కని రోడ్డు భలేగా ఉన్నాయి. పెద్ద పరిశ్రమలుహొఉన్న దగ్గర కూడాహొహొకార్మికులకు దగ్గరలో 20,30 అంతస్తులహొహొభవనాలు ప్రభుత్వం కట్టించి ఇచ్చినవి కనిపించాయి. ఎవరూ విడిగా స్థలం కొనుక్కోవడం ఉండదు. కావాలంటే ప్రభుత్వమే లీజుకిస్తుంది. వందల ఎకరాలు పోగు చేసుకోవడం కుదరదు. ఈ దారి పొడవునా వరి పొలాలు, కూరగాయల సాగు, పూల నర్సరీలుహొఉన్నాయి. ఎక్కడాహొహొసాగులోలేని భూమి కనిపించలేదు. నగరాల్లో కొంచెం స్థలం కూడా వధా కానివ్వలేదు.
చైనాలో విదేశీ యాత్రికులు ప్రతిచోటా తప్పనిసరిగా పాస్‌పోర్ట్ చూపించాలి. ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ మాత్రమే కాదు జూకి,హొమ్యూజియంకి వెళ్ళినా సరే చూపించాలి. అక్కడివారు కూడా వారి గుర్తింపు కార్డు చూపాలి. దీనివలన ప్రతివారి కదలికలు చూస్తే తెలిసిపోతాయి. రోజుకి చాలాసార్లు బయటకు తీయడం, లోపల పెట్టటం, తొందరలో ఎక్కడయినా పోతుందేమోనని భయంతో గడిపాం. మా ట్రిప్ మేనేజర్ మధ్యలో పాస్‌పోర్టు చెక్ చేసుకోండి అనగానే అందరం చూసుకోవడం గుర్తొస్తే ఇప్పుడు నవ్వొస్తుంది. వేరేదేశాల్లో ఇంతగా చూపవలసిన అవసరం లేదని తెలిసింది.
షియాన్‌హొచైనా పురాతనహొహొరాజధాని. చిన్న పట్టణం. మరునాటి ఉదయం దగ్గరలోని సిటీ వాల్ దగ్గరకు వెళ్ళి గోడ పైకి వెళ్ళాం. ఇది కూడా చాలా విశాలంగా అన్ని వైపులా ద్వారాలతో ఉంది. 1370 లో మింగ్ రాజ వంశస్తులు నగర రక్షణ కోసం కట్టుకున్న గోడ పొడవు 14 కి మీ. పెద్ద పెద్ద బురుజులు, గోపురాలతో అందమైన రంగులతోహొకట్టారు. ఈ దేశంలో పెద్ద కట్టడాలు అన్నీ కూడా బౌద్ధ ఆరామాల మాదిరిగాహొపై కప్పుల అంచులు వంపు తిరిగి ఉంటాయి.హొఏ నగరంలో చూసినా ఇవి ఎక్కువగా కనపడతాయి.
అక్కడ నుండి టెర్రకోట బొమ్మలు తయారు చేసే పరిశ్రమకు వెళ్ళాం. మన గణేష్ బొమ్మలు చేసే అచ్చుల వంటి వాటిలో మట్టి పెట్టి మనం కూడా చేయొచ్చు. అక్కడ కళాకారులు తయారు చేసిన పెద్ద పెద్ద టెర్రకోట రాజుల, సైనిక వీరుల విగ్రహాలు, అనేక ఇళ్లలో వాడుకునే వస్తువులుహొచాలా సజనాత్మకంగా చేతితో చేసినవిహొ ఎగ్జిబిషన్లోహొఉన్నాయి. మట్టి తోనే కాక చెక్కతో, రాతితో చేసినవి ఉన్నాయి. ఖరీదు ఎక్కువే.. లక్షల్లో ఉన్నాయి.
మధ్యాహ్నం టెర్రకోట వారియర్స్ మ్యూజియం దగ్గరకు వెళ్ళాం. రాజు క్విన్ షి హువాంగ్ మరణానంతరం అతని శరీరంతోపాటుహొసైనిక దుస్తుల్లో, ఆయుధాలతో ఉన్న వేరుగా ఉండే ముఖ కవళికలతో సహజంగా ఉండే ఆరడుగుల టెర్రకోట వీరుల వేలకొద్దీ విగ్రహాలను ఖననం చేశారు. కొన్నిహొహొవందల సంవత్సరాల తర్వాతహొ1974 తవ్వకాలలోహొహొఆరు నుండి ఎనిమిది అడుగుల లోతున 2000 కు పైగా విగ్రహాలు బయటపడ్డాయి. వీటితో పాటు మట్టి గుర్రాలు, రథాలు, శరీర భాగాలు అనేకం దొరికాయి. కొద్ది దూరం లోనే మూడు చోట్ల బయట పడ్డాయి. ప్రపంచ వింతగా గుర్తింపు పొందింది.
తరువాత రోజు ఉదయం ముస్లిం క్వార్టర్ అనే ప్రదేశానికి వెళ్ళాం. టాంగ్ రాజుల కాలంలో వేరే దేశాల నుండి ముస్లిం వ్యాపారులు షియాన్‌కు వచ్చి హువాజు మసీదు చుట్టు పక్కల నివసిస్తూ ఒక వీథి పొడవునా వ్యాపారాన్ని విస్తరించారు. చైనాలో ఎక్కువ మందికి మతం లేదు.హొహొ30% బుద్ధిజం పాటించే వారు, 2% క్రిస్టియన్లు,హొ2% కన్నా తక్కువగా ముస్లిమ్ జనాభా ఉన్నారు. బుద్ధుని ఆలయాలు చాలా పెద్దవి ఉన్నాయి. విగ్రహారాధనహొవద్దని, తను దేవుణ్ణి కాదని తనను పూజింపవద్దనీ చెప్పినా ప్రజలు బాగానే ప్రార్థనలు చేస్తున్నారు. కానీ చెప్పులు బయట వదల వలసిన అవసరం లేకుండానే బుద్ధుని చూడవచ్చు.
బిగ్ వైల్డ్ గూస్ పగోడా దగ్గరికి వెళ్ళాం. పగోడా అంటే గోపురం వంటిదే. తమిళనాడులోని దేవాలయాల ముందుండే పెద్ద గాలి గోపురంలా చాలా ఎత్తుగా ఉంది. దగ్గరలోని బుద్ధుని ఆలయం, చుట్టు అందంగా పెంచిన పూలతోటలు, చక్కని వాతావారంలో తిరిగాం. విహారయాత్ర అని ఎక్కడికి వెళ్ళినా బాగా నడవాలి. నడవలేని వారికి మాత్రం ఇటువంటి ప్రయాణాలు కష్టమే. కనీసం రోజుకిహొఐదు, ఆరు కిలోమీటర్లుహొనడవగలగాలి. మా గ్రూప్‌లో కొంత మంది మెట్లుహొఎక్కలేక కొన్నిసార్లు రూమ్‌లోనే ఉండిపోయారు.
మధ్యాహ్నం షియాన్ చరిత్రను తెలియచేసే మ్యూజియంకు వెళ్ళాం. ఒకప్పటి రాజధానిలో రకరకాల ఇళ్ళ నిర్మాణాలు, విలువైన అవశేషాలు, మట్టితో చేసినవి పాత్రలు, జేడ్ అనే విలువైన రాయి, కంచుతో చేయబడిన వస్తువులు, పెయింటింగ్స్, చేతిరాతలు చూసినప్పుడు చైనాలో పురాతన కాలంలో ప్రజలు ఎలా జీవించారో తెలిసింది.హొసాయంత్రం బయలుదేరి జాంగ్జియాజీహొనగరానికి వెళ్ళాం .ఉదయం మొదటగా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళాం. ఫోన్‌లో వీడియోలు చూసి అసలు గ్లాస్ మీద నడవగలమా.. అని భయపడుతూ అడుగు పెట్టి మెల్లగా ముందుకు వెళ్ళాం. 300హొమీటర్ల ఎత్తులో, 430 మీటర్ల పొడవుతోహొ1996 లో ప్రారంభించబడింది. దూరంగా రెండు వైపులా అద్భుతమైనహొకొండలు వరుసగా ఉండి, మధ్యలో బ్రిడ్జి కింద లోతులో ఒక చిన్న నదీ ప్రవాహం చూస్తూంటే గుండె ఝల్లు మంటుంది.హొభయమనిపించినప్పుడు పక్కన హాయిగా నడిచే అవకాశం ఉంది. బ్రిడ్జి రెండో చివరి వరకూ వెళ్ళి రావొచ్చు. చాలా మంచి అనుభూతి.
మధ్య చైనా లోని హునాన్ ప్రావిన్స్ లోని ఉన్న జాంగ్జియాజీ నేషనల్ పార్క్‌కు వెళ్ళాం. మేం వెళ్ళిన బస్‌హొదిగి కొంత దూరం మెట్లు ఎక్కి, రెండు షటిల్ బస్‌లు ఎక్కి, దిగి ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఎలివేటర్‌లో పైకి వెళతాం. కిందనుండి కొంచెం కొంచెం కనపడుతూ ఉంటుంది పూర్తిగా పైకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యంతోహొనోరు వెళ్ళబెడతాం. నేలమీద స్వర్గం అంటే అదేనేమో..హొఆకాశాన్ని తాకే స్థంభాల్లాంటి కొండలు వరుసగా గాల్లో వేలాడుతున్నట్టుహొఉండేహొవీటి పేరు టియాంజి పర్వతాలు. అంత ఎత్తున వాటిని ఎంతసేపు చూసినా తనివిహొతీరదు. ఇది ఎవరికి వారుహొకళ్ళతో చూసి అనుభవించాలి కానీ ఇలాహొఅని చెప్పలేం. దట్టమైన అడవుల మధ్యహొమేఘాల్లోకిహొహొదూసుకు పోయేలా నిటారుగాహొకొండలు, లోతైన లోయలు, కాలువలు, గుహలతో కూడిన ప్రదేశం. కిందకు కేబుల్ కార్, బస్‌లో తేలికగా వచ్చేశాం. చాలా ఎక్కువ నడిచింది ఈ రోజే. నడవలేని వారిని టికెట్‌తో హెలికాప్టర్‌లో రెండు సార్లు తిప్పి తీసుకువచ్చారు.
మర్నాడుహొపర్వతం కింద పచ్చదనం, నీటి ప్రవాహం ఉన్న పార్కు చూసిహొబస్‌లో స్టేషన్ వచ్చి అక్కడనుండిహొహై స్పీడ్ ట్రైన్‌లో గులిన్‌హొవచ్చాం. మరుసటి రోజు పొద్దునహొహొరీడ్ ఫ్లూట్ గుహల దగ్గరకు వెళ్ళాం. మన బొర్రా గుహలు లాగానే రంగు రంగుల దీపాలతో అలంకరించారు. కానీ చాలా పరిశుభ్రంగాహొఉన్నాయి. కొండల్లోని సున్నపు రాయి నీటితో కలిపి గుహలోకి కారి, రాయిలాహొమారి వివిధ రూపాలు సంతరించుకుంటాయి. మా గైడ్‌హొవాటిని దేవుని రూపమని, సింహం అనీ, కాలీఫ్లవర్ అనీ ఏవో చెప్పాడు. నడిచే దారంతా తడిగా ఉన్నా ఎక్కడా జారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.హొపేరుకు తగ్గట్టు బయటకు వచ్చేముందు వినిపించే మంచి వేణు గానం మనసుకు హాయిగా అనిపించింది.
దగ్గరలోనే ఉన్న ఎలిఫెంట్ ట్రంక్ హిల్ వద్దకు వెళ్ళిహొలీ నది ఒడ్డున తిరిగాం. ఏనుగు నదిలో నీళ్ళు తాగుతున్నట్లుహొకొండ వంపు తిరిగి ఉంది. సాయంత్రంహొచిరుజల్లులో పెద్ద పెద్ద వెదురు బొంగులతో చేసిన పడవహొప్రయాణం మరచి పోలేనిది.
నది ఒడ్డున ఉన్న ఒక పురాతన గ్రామంలో తిరిగాం. చిన్న వీధిలో చెక్కలతో కట్టబడిన ఇళ్ళుహొపాత సినిమాలోహొహొసెట్టింగ్‌లాహొఉంది. మధ్యలో రాళ్ళు, సిమెంట్‌తో కట్టిన పెద్ద ద్వారాల లాగా ఉన్నాయి. పురాతన సంసతిని, కట్టడాలను కాపాడుకోవడానికి ప్రజలు, ప్రభుత్వం కషి చేస్తుంది.
తరువాత రోజు బయలుదేరి ఫ్లైట్‌లో షాంఘై వచ్చాం. మెట్రోపాలిటన్ నగరంగా దేశహొఆర్థిక రాజధానిగా పేరుంది. చైనాలోహొహొమొదటి, ప్రధాన ఓడరేవుగా, వ్యాపార కేంద్రంగా అభివద్ధి చెందింది. ఇంకా సైన్స్, టెక్నాలజీ, టూరిజం, రీసెర్చ్, సంస్కతికిహొహొఆయువు పట్టుగా ఉంది. జనాభా సుమారు రెండున్నర కోట్లు. నివాసానికిహొబీజింగ్ కన్నా ఖరీదైన నగరం.హొమధ్యాహ్నం ఇండియన్ కిచెన్‌లో మంచి భోజనం అయ్యాక కొంతమంది షాపింగ్ చేశారు. సాయంత్రం ఒక మంచి ప్రదర్శనకు వెళ్ళాం. సర్కస్‌లో చేసే విన్యాసాలు, ఎక్సిబిషన్‌లో చేసేహొగోళంలో ఏడుగురు ఒకేసారి బైక్‌తోహొహొవేగంగా ఆడపిల్లలుహొకూడా తిరగడం వంటివి అద్భుతంగా చేశారు .
చైనాలో ఉచిత ఆరోగ్య రక్షణ సదుపాయం ఉంది. ప్రజలు ప్రభుత్వ మద్దతు కల తప్పనిసరి బీమాతో కలసి వైద్యం చేయించుకుంటారు. ప్రాథమిక వైద్యం తేలికగానేహొదొరుకుతుందిహొకానీ ఆసుపత్రిలో ఉండవలసిన పెద్ద సమస్యలకు ఖరీదు అవుతుంది. 95% బీమా కిందకు వస్తుంది.హొవిద్య విషయంలో మొదటిహొహొతొమ్మిది సంవత్సరాలు ప్రాథమిక, కొంత మాధ్యమికహొవిద్య తప్పనిసరి, ఉచితం కూడా. చైనా భాషను తప్పక నేర్చుకోవాలి. పెద్ద పెద్ద నగరాల్లో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడరు. వ్యాపార లావాదేవీలు అంతా సొంత భాషలోనే చేస్తారు. పెద్ద చదువుకు చదువులను బట్టి ఫీజులు చెల్లించుకోవాలి. అక్కడ పిల్లలకు క్రమశిక్షణ, హోమ్ వర్క్‌హొహొఎక్కువగానే ఉంటుందట.
హొఉదయం షాంఘై జూ కి వెళ్ళాం. చాలా పెద్దది. నడవలేనివారు బ్యాటరీ కారులో వెళ్ళే అవకాశం ఉంది. పులులు, సింహాలు, ఏనుగులు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉన్నాయి. చిక్కని పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ నుండి జేడ్ బుద్ద టెంపుల్‌కు వెళ్ళాం. జేడ్ అనే ఖరీదైన రాతితో చేసిన పెద్ద బుద్దుని విగ్రహం ఉంది. చాలా రకాల బుద్ద విగ్రహాలున్న పెద్దహొహొఆవరణ.హొహొ
మధ్యాహ్నం షాంఘైకి తలమానికంగా ఉన్నహొప్రపంచం లోని మూడవ అతిపెద్ద ఆకాశహర్మ్యం (షాంఘై టవర్స్) దగ్గరకు వెళ్ళాం. 118 అంతస్తులు 57 సెకన్లలో పైకి తీసుకువెళ్ళే లిఫ్ట్‌లో వెళతాం. చుట్టూ అద్దంలో నుండి నగరాన్ని మొత్తం చూడొచ్చు. క్రిందకి చూస్తే రోడ్లు, కార్లు చిన్న బొమ్మల్లా కనపడుతూ అద్దం దగ్గరకు వెళ్ళినా కళ్ళు తిరిగినట్లు అవుతుంది. ఇవన్నీ భవనాలా, పేకమేడలా అన్నట్లు కిక్కిరిసి ఉంటాయి. నగరానికి హారంలా భవనం పక్కనుండి వంపు తిరిగే హువాంగ్ పు నది చాలా దూరం వరకు కనపడుతుంది.
సాయంత్రం ఇదే నదిలో గంట సేపు నదికి రెండువైపులా వెలుగులు విరజిమ్మేహొహొభవనాలను చూస్తూ ఒకవైపు నుండి వెళ్ళి మరోవైపు నుండి వెనుకకు తిరిగి రావడం గొప్ప అనుభూతి. మనల్ని మనం మరచిపోతాం. ఈ ప్రదేశాన్ని బండ్‌హొహొఅంటారు. బండ్ అంటే రేవు, తీరం అని అర్థం. వంద సంవత్సరాల షాంఘై చరిత్ర, అభివద్ధి, సంపద చూడాలంటే ఈ ఒక గంట ప్రయాణం చాలు.
హొతిరుగు ప్రయాణానికిహొముందు రోజు పొద్దున జాజియాజియావో వాటర్ టౌన్ కు వెళ్ళాము. మింగ్ రాజుల కాలంలోహొహొఅభివద్ధిహొచేయబడినహొపట్టణం.హొఒక కాలువకు రెండువైపులాహొరాతితో గట్టు లాగా కట్టి విశాలంగా చేశారు. పురాతన వంతెనలు, కాలువలకు ప్రసిద్ధి చెందిన నీటి పట్టణం.. జనాభా లక్ష లోపు ఉంటుంది. పడవ ప్రయాణం చేయొచ్చు. కాలువకు రెండువైపులా టూరిస్టులుహొఇష్టపడే వస్తువులు, ఆహారం బాగా దొరుకుతాయి. ప్రపంచంలోని అందమైన పది పట్టణాలలో ఒకటిగా పేరు పొందింది. వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. చైనా ప్రజలు వారి సంస్కతి సంప్రదాయాలను గౌరవిస్తూ, కాపాడుకుంటారు.
మధ్యాహ్నం షాంఘై ఎయిర్పోర్ట్ నుండి లాంగ్యాంగ్ అనే ప్రదేశానికి అయస్కాంత శక్తితో నడిచే ట్రైన్లో (ఎaస్త్ర శ్రీవఙ ్‌తీaఱఅ) ప్రయాణం చేశాం. 30 కిలోమీటర్ల దూరాన్ని ఏడు నిమిషాలలో చేరుతుంది. మేం వెళ్ళి అలాగే 20 నిమిషాలలో వెనక్కి వచ్చాం. అత్యంత రద్దీగా ఉండే షాంఘైలో ప్రయాణీకులకు ఇది వరం అనే చెప్పాలి. నాయకుల దూరదష్టి, దేనికోసం ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలనే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.
తరువాత షాంఘైలో షాపింగ్. దాదాపు అందరం ఏదో ఒకటి కొన్నాం. ప్రపంచంలోని ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. కాకపోతే బాగా బేరమాడాలి. చాలా వస్తువులు వెయ్యిహొచెప్పి వందకు ఇస్తారు. కొన్నిటికి మాత్రం అలా కుదరదు.హొహొచైనాలో ప్రపంచంలోని ప్రతి వస్తువుకీ నకిలీది దొరుకుతుంది. ఇందులో మోసం లేదు. నకిలీ అని చెప్పే అమ్ముతారు. సూది నుండి ఖరీదైన కార్ల వరకు కూడా. జనాభాహొహొదాదాపు మనలాగా ఉన్నా వనరుల ఉపయోగం ఎక్కువ, ప్రజల అవసరాల కోసం బాగా ఖర్చు పెడుతున్నారు. ప్రతివారూ ఏదో ఒక పని చేసుకుంటారు. కష్టపడుతూ హాయిగా బ్రతుకుతున్నారు. చదువుకునే, పనిచేసుకునే మహిళలకు నూరు శాతం రక్షణ ఉంటుంది. నేరాల సంఖ్య కూడా చాలా తక్కువ. కాలుష్య నివారణకు, మధుమేహం, బీపీ, గుండెజబ్బుల వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం కషి చేస్తున్నారు.
మొత్తం చైనాలో రెండు విమాన, రెండు బుల్లెట్ ట్రైన్ ప్రయాణాలు, రెండు కేబుల్ కార్‌లలో తిరుగుతూ ఎంజారు చేశాం. ఇటువంటి గ్రూపు ప్రయాణాల వలన లాభాలు.. అన్నీ వాళ్ళే చూసుకుంటారు, భోజనం, ఉండడానికి గదులు, రవాణా,హొహొటికెట్ల వంటివి వెతుక్కునే పని ఉండదు. కొత్త పరిచయాలు, కొత్త చోట, కొత్త వారితో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని నేర్చుకోగలం.హొమనం బయటి వారితో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోహొకూడా తెలుస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా చూడాలనుకున్నవి, వెళ్ళాలనుకున్నవి కుదరదు. మా గ్రూపుతోహొమేం బాగా ఎంజారు చేశాం. మీరు కూడా వీలైనంత వరకు లోకాన్ని చూసే ప్రయత్నం చేయండి.
– డా|| సిహెచ్.శారద, 9966430378