
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయాలకు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులకు విద్య వైద్యా సంస్థలన్నింటికీ ఉచితంగా కరెంటు సరఫరా అందిస్తామని వీటి కోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తామంటూ తీసుకోబోతున్న నిర్ణయాలకు ప్రజల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటి కోసం ప్రజా సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతున్నందున జుక్కల్ శాసనసభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాష్ట్ర ప్రభుత్వానికి జుక్కల్ నియోజకవర్గం ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు.