Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కారోబార్లు అరెస్ట్.!

కారోబార్లు అరెస్ట్.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : కాటారం మండల పరిధి పంచాయతీలలో పనిచేస్తున్న కారోబార్లను కాటారం పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు కారోబార్ లు తెలిపారు. కారోబార్లు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాదులో పంచాయతీరాజ్ ముట్టడి కార్యక్రమం శుక్రవారం ఉన్న నేపథ్యంలో కారోబార్లు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు వివరించారు. కాటారంకు చెందిన దోమల శ్రీనివాస్, ప్రతాపగిరికి చెందిన మెండ మల్లికార్జున రావు, శశి కుమార్, బి రవి, కొండయ్య కారోబార్లను హైదరాబాద్ కు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పెండింగ్లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కారోబార్లు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -