– వారంలో 1.02 బిలియన్ల తగ్గుదలఆర్బీఐ వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో మరోమారు తగ్గుదల చోటు చేసుకుంది. జూన్ 20తో ముగిసిన వారంలో 1.02 బిలియన్ డాలర్లు తగ్గి 697.93 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇది ఇంతక్రితం వారం నమోదైన 698.95 బిలియన్లతో పోల్చితే తగ్గుదలను సూచిస్తుందని పేర్కొంది. ఈ తగ్గుదల విదేశీ కరెన్సీ ఆస్తుల (ఎఫ్‌సిఎ), బంగారం నిల్వలలో మార్పుల కారణంగా చోటు చేసుకుందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.
ఫారెక్స్ నిల్వలలో ప్రధాన భాగం అయినా విదేశీ కరెన్సీ ఆస్తులు 0.89 బిలియన్లు తగ్గి 618.22 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ ఆస్తులలో యూరో, యెన్, పౌండ్ వంటి కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే విలువలో స్వల్ప హెచ్చు తగ్గులు చెందడం ఈ తగ్గుదలకు కారణం. అదే సమయంలో బంగారం నిల్వలు 0.11 బిలియన్లు తగ్గి 54.76 బిలియన్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 0.02 బిలియన్లు తగ్గి 18.14 బిలియన్లకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో భారతదేశ నిల్వలు స్వల్పంగా తగ్గి 4.81 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి.”ఫారెక్స్ నిల్వలలో ఈ తగ్గుదల సాధారణ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా సంభవించింది. ఇది ఆర్థిక స్థిరత్వంపై పెద్ద ప్రభావం చూపదు.” అని ఆర్బీఐ గవర్నర్ సంజరు మల్హోత్రా తెలిపారు. భారతదేశ ఫారెక్స్ నిల్వలు ఇప్పటికీ దేశ దిగుమతులను సుమారు 14 నెలల పాటు భరించగల స్థాయిలో ఉన్నాయన్నారు. గత కొన్ని నెలలుగా ఫారెక్స్ నిల్వలలో స్వల్ప హెచ్చుతగ్గులు సాధారణమయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విదేశీ మారకం నిల్వల్లో పతనం
- Advertisement -
- Advertisement -