ధోతి గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం 

Free eye camp under the leadership of youth in Dhoti villageనవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి మండలం పరిధిలోని దోతీ గ్రామంలో సోమవారం నాడు ఆ గ్రామ యువకులు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ బోధన్ వైద్యుల ద్వారా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య ఉచిత శిబిరంలో గ్రామ ప్రజలు కంటి చికిత్సలను జరిపించుకున్నారు. మోతి బిందు గుర్తించిన వారికి కంటి ఆపరేషన్ చికిత్స జరుపబడుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగమేశ్వర్, దోతీ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్ , దేవదాస్ పటేల్, మాజి సర్పంచ్ సోమూర్ సంగ్రం పటేల్, రచప్ప పటేల్ ,శ్రీకాంత్ పటేల్ , శివరాజ్ పటేల్,హన్మంత్ ,భాస్కర్ పటేల్ లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ క్యాంప్ ఇంచార్జ్ హనుమంతరావు పటేల్, సతీష్, సిబ్బంది,గ్రామ యువకులు ప్రజలు పాల్గొన్నారు.
Spread the love