సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని ఎమ్మెల్యేకు వినతి..

నవతెలంగాణ- మునుగోడు
సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తమ ప్రత్యేక క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్పి ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందపాక నాగరాజు , జిల్లా మెసెంజర్ ల సంఘం గౌరవ అధ్యక్షులు భీమరాజు సాయిలు, వి.ఇందిర, సీ.హెచ్. ఇందిరమ్మ, బి. మంగమ్మ, ఆర్. అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love