వనమహోత్సవ లక్ష్యాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

Vanamahotsava target to be completed by month end: Collector–  ప్రజావాణి దరఖాస్తులన్ని 15 రోజులలో పరిష్కరించాలి
– రుణమాఫీ జమకాని అకౌంట్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
వనమహోత్సవ లక్ష్యాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి  ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వివిధ అంశాలపై సమీక్షించారు.మొక్కలు నాటడం తో పాటు, వాటిని సంరక్షించడం ముఖ్యమని తెలిపారు. ఆయా సంస్థలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు, మంచి మొక్కలు నాటాలని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలని సూచించారు.  ప్రజావాణిలో భాగంగా వచ్చిన ఫిర్యాదులన్నింటిని వచ్చే  15 రోజుల్లో నూటికి నూరు శాతం  పరిష్కరించాలని, ఇకపై ఏ వారం ఫిర్యాదులు ఆవారమే పరిష్కరించే విధంగా అధికారుల వద్ద ఆ వారానికి సంబంధించిన పిర్యాదులు మాత్రమే ఉండాలని అన్నారు.రుణమాఫీకి సంబంధించి ఇంకా రుణమాఫీ జమకాని అకౌంట్ల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.విద్య, వైద్య రంగాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి-ఎస్ ఐపాస్, టీ ప్రైడ్ కింద పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీ పై వాహనాల అనుమతికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతి ఇచ్చారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Spread the love