– జైపూర్ ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్
నవతెలంగాణ-జైపూర్
వర్షాలంలో వచ్చే వ్యాధుల పట్ల గ్రామీలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఎంపీడీఓ గుర్రం సత్యనారాయణగౌడ్ సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ శ్రీపతి బాబుతో కలిసి గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నందున గ్రామ పంచాయతీల పరిధిలో ఏదైనా నష్టం సంభవిస్తే వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలని తెలిపారు.
వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా నిరంతరాయంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ దోమ నివారణకు ఫాగింగ్ చేపట్టాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్త పడాలని పైప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించాలని, వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని తెలిపారు. వెజ్ పేమెంట్లు ఆలస్యం జరగకుండా పంచాయతీ కార్యదర్శులు మాస్టర్ లపై సంతకాలు చేయాలని ఆదేశించారు. ఎంపీ డబ్ల్యూ వర్కర్ల వేతనాలు ఎస్‌ఎఫ్సి నిధుల నుంచి చెల్లించాలని అన్నారు.