సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ 

నవతెలంగాణ బొమ్మలరామారం 

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని బొమ్మలరామారం ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ అన్నారు.మంగళవారం మండలంలోని సోలిపేట గ్రామంలో గల ఇమ్మానియేల్ బిజినెస్ కళాశాలలో అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సైబర్‌నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫీక్‌ నిబంధనలు పాటించాలన్నారు. యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రావ్యాలకు దూరంగా వుండాలన్నారు.అలాగే సోషల్ మీడియా ప్రభావం చదువులకు అడ్డంకిగా మారిందని వీటికి దూరంగా వుండాలన్నారు.బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు నేరమని తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తే చట్ట రీత్యానేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఏఎస్ఐ దేవేందర్, కానిస్టేబుల్ సోమేష్ కుమార్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love