– సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
కామ్రేడ్ చంద్రశేఖర్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష అన్నారు. శుక్రవారం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ పోస్టర్లను పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్ భవన్, కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ 50 సంవత్సరాలుపైగా సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేశారన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ మరణం పార్టీకి, విప్లవోద్యమానికే కాకుండా, పీడిత వర్గాలకు ఎనలేని లోటన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్‌కు సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 28న సంస్మరణ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు పార్టీ జాతీయ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తదితరులు ముఖ్యవక్తలుగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వెంకన్న, సహాయ కార్యదర్శి సీహెచ్ సాయగౌడ్, జిల్లా నాయకులు డి.కిషన్, మురళి, మోహన్ పీ.ఓ.డబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, ఐఎఫ్‌టీయు జిల్లా నాయకుడు సాయరెడ్డి, కిరణ్, గంగాధర్, పీఓడబ్ల్యు నాయకురాలు సుధారాణి, అమూల్య, నసీర్, సృజన్, శివకుమార్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ చంద్రశేఖర్ పోరాట స్ఫూర్తిని అనుసరించాలి..
నవీపేట్ : విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసి ఆకస్మిక మరణానికి గురైన కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ పోరాట స్ఫూర్తిని విప్లవ శ్రేణులు అనుసరించాలని సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథ) రాష్ట్ర కమిటీ సభ్యులు నరేందర్ అన్నారు. మండలంలోని అభంగపట్నంలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంతాప సభను బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో సాయిరెడ్డి, రాజేశ్వర్, లింబాద్రి, హన్మాన్లు, కవిత, సుజాత, రేఖ, తదితరులు పాల్గొన్నారు.