- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : ఆదివాసుల అక్రమ అరెస్టులు అమానుషమని సీఐటీయూ జన్నారం మండల అధ్యక్షుడు అంబటి లక్ష్మణ్, నాయకులు దాసర్ల రాజన్న పేర్కొన్నారు. గురువారం మండలంలోని తపాలాపూర్లో ఆదివాసి గూడెంలో పర్యటించారు. మండలానికి చెందిన ఆదివాసీ నాయకుడు ఆత్రం రాజుతోపాటు ఆయన ఇద్దరు కుమారులు రవికుమార్ సుధాకర్ లను ఫారెస్ట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం సరికాదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
- Advertisement -