డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Independence Day Celebrations at Don Bosco Junior Collegeనవతెలంగాణ – చండూరు 
స్థానిక డాన్  బోస్కో జూనియర్ కళాశాలలో 78వ, స్వాతంత్ర్య దినోత్సవ  వేడుకలను ఘనంగా నిర్వహించారు . కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ రాజేశ్  పతాక ఆవిష్కరణ చేసి, భారత దేశం స్వేచ్చా, సమానత్వం, సౌబ్రాతృత్వం కలిగిన  అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను అని, నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతుందని, ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు వారి జీవితాలను త్యాగం చేసి మనకు ఈ స్వేచ్చా, స్వాతంత్రాలను ప్రసాదించారని వారి ఆశయాలకు అనుగుణంగా మన జీవన ప్రయాణం కొనసాగాలని కొనియాడారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్డులకు బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్ధిని, విధ్యార్ధులు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ   సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫాదర్ బలశౌరెడ్డి, అధ్యాపకులు, విధ్యార్ధిని విధ్యార్ధులు పాల్గొన్నారు.

Spread the love