– రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ, కృతజ్ఞత సభపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ, వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభకు అధిష్టానం పెద్దలను ఆహ్వానిం చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. వారితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా హస్తినకు బయలుదేరారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియగాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశం కాను న్నారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై జరగనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆహ్వానిస్తారు. రూ.2లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నారు.