Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇంటి నమూనకు భూమిపూజ..

ఇందిరమ్మ ఇంటి నమూనకు భూమిపూజ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచర్లలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారి శ్రీనివాస్ సమక్షంలో సోమవారం ఇందిరమ్మ నమూనా ఇంటికి మార్కింగ్ చేసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మండలంలో మొదటి విడతలో 200 ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోసింగ్ డిఈ శ్రీకాంత్, ఏఈలు రాయలింగు, రజినీకాంత్, మండల సూపరిండెంట్ సత్యనారాయణ మూర్తి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -