- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రం నుండి రాజంపేట్ మండలం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీంతో రామేశ్వర్ పల్లి గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకాటిపల్లి వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్ తో మాట్లాడి నిలిచిన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలపడంతో పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించినందుకు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -