ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో వృద్ధుల సంక్షేమం కోసం వారి హక్కులు పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం ధ్యేయంగా జిల్లాలో వారోత్సవాల లో భాగంగా మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని అనాధాశ్రమంలో శుక్రవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. విజేతలకు బహుమతి ప్రధానం తో పాటుగా సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. తదనంతరం చింతకుంట గ్రామం లో ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో ఆల్ పెన్షనర్స్ అధ్యక్షులు రామ్మోహన రావు మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని ,వారసులు ఇబ్బందులు పెట్టినట్లయేతే వారిని శిక్షించే అధికారం చట్టం కల్పించిందని వాటిని అందరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో ఇంకా అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు మోహన్, ఈవిఎల్ నారాయణ, గుర్రాల సరోజనమ్మ మదన్మోహన్ .డి లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, అద్దంకి ఉషాన్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. డాక్టర్ జోష్ణ, పీహెచ్ఎన్ కృష్ణవేణి, సూపర్వైజర్ సాయమ్మ, మేరీ విజయ, సాత్విక, ఆశ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.