వర్గీకరణపై జ్యుడీషియల్‌ కమిషన్‌

– మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. శనివారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పంజాబ్‌, హర్యానా, తమిళనాడుల్లో వర్గీకరణ అమలుకు ముందు ఏకసభ్య జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు విషయాన్ని ఉపసంఘం ప్రస్తావించింది. దీనిపై సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావాలని నిర్ణయించారు. ఎస్సీ జనగణనకు 2011 ప్రభుత్వ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

Spread the love