మంత్రి ఉత్తమ్‌కు డిప్యూటీ సీఎం పరామర్శ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఇటీవల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డిప్యూటీ సీఎం విదేశీపర్యటనలో ఉన్నారు. శనివారం మంత్రి ఉత్తమ్‌ సోదరి రుక్ష్మిణి నివాసంలో ఆయన సోదరుడు గౌతమ్‌ కుమార్‌ను కూడా కలిసి సంతాపం, సానుభూతి తెలిపారు. వారి తండ్రి పురుషోత్తంరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Spread the love