ముగిసిన దసరా సెలవులు 

Dussehra holidays are over– తిరుగు ప్రయాణం అయిన విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
దసరా సెలవులు సోమవారం తో ముగియడంతో బస్టాండ్ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ మేరకు మంగళవారం నుంచి విద్యాసంస్థలు తెరుచు కోనున్నాయి. పండగ సెలవుల కోసం సొంతూళ్లకు వచ్చిన విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజలు, తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ప్రయాణికులతో ఆర్ టి సి బస్టాండ్ లు కిక్కరిసి పోయాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిజామాబాద్ నగర బస్టాండు వెలది వేలా మంది ప్రయాణికులతో కిటకిట లాడింది. ముఖ్యంగా మారు మూల ప్రాంతాలకు పండగల కోసం వెళ్లిన వారంతా సోమవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రానికి చేరుకుంటుండడంతో గ్రామాల నుంచి వచ్చే బస్సులు సైతం నిండుగా వస్తున్నాయి.వేలాదిగా హైదారాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్నవారు ఉన్నారు, కానీ ఆర్టీసీ అధికారులు రద్దీ కి తగ్గట్టుగా అదనపు సర్వీస్ లను ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో ప్రయాణికులు బస్సులకోసం బస్టాండు లోనే గంటల తరబడిగా పాడిగాపులు కాస్తున్నారు. ఎలాగో అదనపు చార్జీలు ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు అవసరాల మేరకు బస్సు లు సిద్ధం చేయక పోవడం ఫై ప్రయాణికులు మండిపడుతున్నారు.
Spread the love