పేదరికం చూసి నవ్వడం తప్ప పేదలను ఆదుకునే పద్ధతి తెలియదు: ఎస్ వీరయ్య

నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాయ మాటలతో కల్లబొల్లి మాటలతో కథలు చెప్పుతూ కాలం వెళ్లదీస్తుంది తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడు గూడు నీడనివ్వాలని నాలుగు డిమాండ్లతోటి గుడిసెలు వేసుకున్న వారికి ఇల్లు నిర్మాణం చేయాలని ప్రజా సంఘాల పోరా ఐఖ్య వైదిక ఆధ్వర్యంలో బస్సుయాత్ర శనివారం రాత్రి భిక్నూర్‌ మండలం జంగంపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు జంగంపల్లి భూ సాధన సమితి సభ్యులు యాత్ర బృందానికి బస్టాండ్ ఆవరణలో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీ అనంతరం చాకలి ఐలమ్మ, వివేకానంద, మాత్మ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి మల్లు స్వరాజ్యం కాలనీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజా సంఘాల పోరాటైక్యవేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ పైకి బాగానే ఉన్నా ఏ ఒక్క లబ్ధిదారునికి చేరే అవకాశమే లేదని, తెలంగాణ ప్రభుత్వం పేదరికం చూసి నవ్వడం తప్ప పేదలను ఆదుకునే పరిస్థితి లేదన్నారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడుతూ నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకీ బట్టి పోరాటం చేసిన మల్లు స్వరాజ్యం గారి పేరు పెట్టుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జంగంపల్లి పేద ప్రజలను అభినందించారు. ఆమె పోరాట స్ఫూర్తితో ఉద్యమం ముందుకు కొనసాగించాలని తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రావు, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చంద్రశేఖర్, వెంకట్ గౌడ్, అరుణ్, రాజనర్సు, స్థానిక మండల నాయకులు అర్జున్, ప్రవీణ్, పేరం నర్సవ్వ, బాలమణి, చంద్రకళ, లక్ష్మీ, శ్యామల, కవిత, దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love