దోమల నివారణ మందు పిచికారి

నవతెలంగాణ – అశ్వారావుపేట
గుమ్మడవల్లి పి.హెచ్.సి పరిధిలోని కావడిగుండ్ల లో వైద్యారోగ్య శాఖ ఆద్వర్యం లో దోమల నివారణ మందు ను సోమవారం పిచికారి చేసారు. స్థానిక సర్పంచ్ కంగాల భూ లక్ష్మి ప్రారంభించారు. సమస్యాత్మక గ్రామాలైన కావడిగుండ్ల,కొత్త కావడిగుండ్ల లో దోమల నివారణకు మొదటి విడత దోమల మందు పిచికారి పనులు చేపట్టారు. కొత్త కావడిగుండ్లలో 104, పాత కావడిగుండ్లలో 202 గృహల్లో ఇంటిలోపల, బయటపిచికారి చేసినట్లు సబ్ యూనిట్ అధికారి ఎ వెంకటేశ్వరావు తెలిపారు.ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడలాని,దోమతెరలు వినియోగం పై అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో ఎసియూవో వెంకటేశ్వరావు, పీ.కృష్ణయ్య, కార్యదర్శి రామకృష్ణ, పీ వెంకటేశ్వర్లు, రాధాబాయి. స్వరూపలు, ఆశా లు పాల్గొన్నారు.

Spread the love