మిర్యాలగూడలో జరిగే  బహిరంగ సభ జయప్రదం చేయాలి..

– సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మునుగోడు:  డిసెంబర్ 2,3,4, తేదీలో మిర్యాలగూడలో జరిగే 20వ  సిపిఐ(ఎం ) జిల్లా మహాసభలను  జయప్రదం చేయాలని  సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  బండ శ్రీశైలం పార్టీ శ్రేణులకు  పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో సిపిఐ(ఎం) కార్యాలయం వద్ద  మిర్యాలగూడలో జరిగే మహాసభ సభ కరపత్రాన్ని  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దీవాలి తీయించాయన్నారు. గత ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అంబానీ ఆదోని లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్మేస్తుందని విమర్శించారు.విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్ష లాగా మారింది అన్నారు.ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరిగాయని అన్నారు. నిరుద్యోగం, అవినీతి, ధరలు విలయ తాండవం చేస్తున్నాయన్నారు.రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పార్లమెంట్లో చట్టం చేయాలని, మహిళలపై దాడులు,అత్యాచారాలు అరికట్టాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలని కోరారు . నల్గొండ జిల్లాను సస్యశ్యామల చేసే శ్రీశైలం సొరంగం మార్గం, గండి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం వలన  పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాలేదు అన్నారు.జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, డిపిఆర్ ను ఆమోదించాలని, ప్రభుత్వ శాఖలో వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి చెల్లించాలని  డిమాండ్ చేశారు . 20వేల మందితో, రెండు వేల  మంది హెడ్సెట్ తో, వెయ్యి మంది రెడ్ సారీ తో, కోలాటాలాటలు,  నృత్యం ఆటపాటలతో భారీగా ర్యాలీతో  బహిరంగ సభ జరగనున్నట్లు  తెలిపారు.ఈ కార్యక్రమంలో  సిపిఎం సీనియర్ నాయకులు మిర్యాల భరత్, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్,సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రి పోతుల ధనంజయ,సిపిఎం మునుగోడు మండల సహాయ కార్యదర్శివరికుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు యాసరాణి శ్రీను, యాట యాదయ్య,పగిల్ల మధు, రాజయ్య , డి వై ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love