– కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అదనపు సంచాలకులు సి.శ్రీధర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపకొలాల వర్గీకరణకు సంబంధించిన వినతులను, అభిప్రాయాలను, అభ్యర్థనలను కమిషన్‌కు అందించాలని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అదనపు సంచాలకులు సి శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలల్లోని ఉపకులాల వర్గీకరణ అభ్యసన కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని మొదటి అంతస్తులో బి బ్లాక్ కార్యాలయాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ కులాలకు చెందిన సంఘాలు, వ్యక్తులు తమ వినతులను అందించాలని కోరారు.
ఉదయం 10.30నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యాలయంలో సయ్యద్ అబ్దుల్ రపీ ఉంటారని పేర్కొన్నారు. లేదా [email protected] మెయిల్‌కు పంపాలని తెలిపారు.