నవతెలంగాణ – పెద్దవంగర
పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధులు, సీజనల్ లో వచ్చే వ్యాధులను గుర్తించి అరికట్టాలని మండల పశు వైద్యాధికారి రాజశేఖర్ అన్నారు. ఉప్పెరగూడెం గ్రామంలో పశుసంవర్ధక శాఖ, నోవార్టీస్ అగ్రో ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేశారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ.. పశువుల్లో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. గాలికుంటు వ్యాధి టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ఉచిత పశు వైద్య శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. పాడి రైతులు పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హేమలత, తొర్రూరు ఏరియా గోపాలమిత్ర సూపర్వైజర్ అనిల్, ఎల్ఎస్ఏ రాము, వీఎల్ఓ ప్రభాకర్, గోపాల్ మిత్రులు వెంకన్న, యాకుబ్ పాషా, ఓఎస్ హాసన్, ఉప్పలయ్య, పాడి రైతులు గ్యార సోమయ్య, పెద్ది మల్లేష్, ఓరుగంటి యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.