నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పెద్దవంగర మండల విద్యాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఎంఈవో పాల్గొని, నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పౌరులు భావితరాల అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ్య, శ్రీధర్, సువర్ణ, హైమ తదితరులు పాల్గొన్నారు.