తాడ్వాయి మండలంలో 100% సర్వే 

100% survey in Tadwai mandalనవతెలంగాణ – తాడ్వాయి 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సర్వే) మండలంలో  100% పూర్తయినట్లు మండల అభివృద్ధి అధికారి సుమన వాణి తెలిపారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో 67 మంది ఎన్యూమరేటర్లు, 9 మంది సూపర్వైజర్లు 7600 కుటుంబాలను పూర్తిస్థాయిలో సర్వే చేసినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పడ్డ కష్టం వర్ణతీతం అని ఎంపీడీవో సుమనవాని, తాసిల్దార్ గిరిబాబు, ఎంఈఓ కేశవరావు వారిని అభినందించారు. ఈనెల 20 నుండి 30 వరకు డాటా ఎంట్రీ చేపట్టనున్నట్లు తెలిపారు.
Spread the love