సాయి చంద్ మృతికి సంతాపం..

నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఆకస్మిక మృతికి బిఆర్ఎస్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ తెడ్డు పోశెట్టి గురువారం సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా గాయకుడు తన గానంతో తెలంగాణ ఉద్యమ అన్ని ఉవ్వెత్తున ఎగిసేలా కృషిచేసిన సాయిచంద్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తెలంగాణ ఉద్యమ నేతగా నిలిచిపోతారని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా సేవలందిస్తున్న తరుణంలో సాయిచంద్ మరణించడం తోటి ఉద్యమకారుడిగా తీవ్ర ఆవేదన కల్పించిందని అన్నారు.

Spread the love