సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన ఎస్టియుటిఎస్

STUTS supports comprehensive punishment employeesనవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహించిన సమ్మె కార్యక్రమంలో ఎస్ టి యు టి ఎస్ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి సమ్మెకు బుధవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు తమ సంఘం ఎప్పుడు అండగా ఉంటుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన సమ్మె కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ కూడా మద్దతు తెలపడం జరిగిందన్నారు. చాలీచాలని వేతనాలతో రెండు దశాబ్దాల కాలంగా జీవితాలను వెలదీస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన కోరిక ఉద్యోగ భద్రత వేతనాల పెంపు అనే ప్రధాన డిమాండ్లు న్యాయమైనయని ఆయన అన్నారు. కేజీబీవీ ఉద్యోగులకు  సమగ్ర శిక్ష లో పనిచేయుచున్నటువంటి మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆయన అన్నారు.  అలాగే ఉద్యోగ భద్రత కల్పించే ముందు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, హర్యానా, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో అమలైతున్నటువంటి మెరుగైన వేతనాలను తక్షణమే ఈ రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో ఎస్టియు ఫైనాన్షియల్ సెక్రెటరీ సయ్యద్ ఖలీముద్దీన్, ఎస్ టి యు టి ఎస్ కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు.
Spread the love