డిఎపి అధిక ధరలకు విక్రయించరాదు ..

DAP should not be sold at high prices..నవతెలంగాణ -చండూరు 
మండలంలో ఫర్టిలైజర్స్ నిర్వాహకులు డిఎపి అధిక ధరలకు విక్రయించరాదని మండల ఏవో  చందన హెచ్చరించారు.  బుధవారం మున్సిపల్ పట్టణంలో పలు  ఫర్టిలైజర్ దుకాణాలు ఆమె తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు , రిజిస్టర్లు , గోదాములు, ఎమ్మార్పీ ధరలు ఆమె పరిశీలించారు. కొంతమందికి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు.  ఎవరైనా  నియ నిబంధనలకు అధికమించినట్లయితే  వారిపై కఠిన చర్యలు  తప్పవని  హెచ్చరించారు. ఆమె వెంట ఏఈఓ నాగార్జున ఉన్నారు.
Spread the love