మండలంలోని జక్కల వారిగూడెం గ్రామానికి చెందిన జక్కల మల్లయ్య అనారోగ్యంకు గురి కావడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచ్ జక్కల శ్రీను బాధితులకి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలకు అందాల్సిన ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించాలన్నదే రాజన్న లక్ష్యం అని అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జక్కల మహేష్ , మాజీ ఉప సర్పంచ్ జక్కల నర్సింహ , దోటి మహేష్ , దాసరి సురేష్ , జక్కల నాగరాజు , దాసరి శేఖర్ పాల్గొన్నారు.