మండలంలోని దాస్ నగర్ కూడలి వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో అవమాన పరిచ్చినందుకు నిరసన కార్యక్రమం సోమవారం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్ మాట్లాడుతూ అమిషా మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూన్నమన్నారు. రాజ్యాంగం వ్రాసినటువంటి అంబేద్కర్ ను అవమానిస్తూ అంబేద్కర్ పదేపదే సార్లు స్మరించడము ఆయనేమన్న దేవుడా అంటూ అదే హిందూ దేవుళ్లను స్మరించుకుంటే ఏడు జన్మల స్వర్గాలు దొరుకుతాయని అన్నారు. ఇది మనువాదానికి నిదర్శనమని, ఓట్ల ద్వారా గెలుపు అనేటువంటిది రాజ్యాంగం ద్వారా జరిగినటువంటి విషయమని, నీవు ఎంపీగా గెలవడం రాజ్యాంగ బద్దంగానేజరిగిందని, దానిని నువ్వు జ్ఞాపకం చేసుకొని మాట్లాడాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని, పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని అన్నారు. అనంతరం ద్యారంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానించినటువంటి వారు ఎంత గొప్ప వారైనా ప్రభుత్వం శిక్షించాలని అమిషా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ద్యారంగుల శ్రీనివాసు, రేపటి సుదర్శన్, దండగల నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.