
బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసులో నమోదైన ఇద్దరు బాధ్యులకు 15 నెలల జైలు శిక్ష విధిస్తూ ఒక్కొక్కరికి 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ బోధన్ జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం. పూజిత తీర్పు చెప్పారని బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ తెలిపారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసుల నేరం రుజువు కావడంతో ఆవుల జగన్ మోహన్ రావు , ఆవుల జీవన్ బాబుల పై జైలు శిక్ష , జరిమానా విధించారని తెలిపారు. ఈ కేసులో పరిశోధన చేసి బాధ్యులకు శిక్ష పడటoలో ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ , ఎస్సై కిషన్ సిబ్బందిని ఇంచార్జి సిపి సింధు శర్మ అభినందనలు తెలిపారు.