ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి..

Swami Vivekananda Jayanti under the aegis of Indian Head Cross Society..నవతెలంగాణ – కంఠేశ్వర్
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గాజులపేట్ లో వివేకానంద చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహానికి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఆంజనేయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపి రవీందర్ ,సభ్యుల అబ్బాయి లింబాద్రి గణేష్  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రెడ్ క్రాస్ రక్త నిధిలో రక్తదాన శిబిరం లో22 వ సారీ బొబ్బిలి రామకృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రక్తదానం చేశారు. అనంతరం 10 మంది రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, తోట రాజశేఖర్, వెంకటేశం, మెడికల్ ఆఫీసర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love