స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గాజుల్ పేట్ లోని విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం నివాళులు అర్పించారు. ఈ రోజు యువతకు స్వామి వివేకానంద సూక్తులు ఎంతో అవసరమని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. వారి చూపెట్టిన మార్గంలో నడిస్తే యువత విజయాలు సాధిస్తారని అన్నారు. ప్రభుత్వాలు యువతకు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, కరిపే రవింధర్, తోట రాజశేఖర్, కోడూరు స్వామి, విజయ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.