నవతెలంగాణ హైదరాబాద్: బ్రెజిల్ లెజెండ్స్ వెర్సస్ ఇండియా ఆల్ స్టార్స్ మ్యాచ్ టికెట్ విక్రయాలు ఈనెల 2వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానున్నాయని ఫుట్‌బాల్ ప్లస్ అకాడమీ, ఫుట్‌బాల్+ సమ్మిట్ వ్యవస్థాపకుడు డేవిడ్ ఆనంద్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ మార్చి 30, 2025 రాత్రి ఏడు గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనుందన్నారు. భారతదేశంలో తొలిసారి 2002 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్ లెజెండ్స్ స్క్వాడ్ – రోనాల్డినియో, కాఫూ, రివాల్డో, కోచ్ డుంగా నేతృత్వంలోని ఆటగాళ్లు.. ఇండియా ఆల్ స్టార్స్ జట్టుతో పోటీ పడతారన్నారు. ప్రసిద్ధ కోచ్ ప్రసాంత్ బెనర్జీ నాయకత్వంలో ఈ జట్టు చారిత్రక మ్యాచ్ ఆడనుందన్నారు.
ఫుట్‌బాల్ అభిమానులు దిగ్గజ ఆటగాళ్లను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం అన్నారు. ఈ జట్టులో రోనాల్డినియో, రివాల్డో, కాఫూ, గిల్బర్టో సిల్వా, ఎడ్మిల్సన్, క్లెబర్సన్, రికార్డో రికార్డో ఒలివెరా, కాకాపా, కామండుకాయ, ఎలివెల్టన్, పౌలో సెర్జియో, హ్యూరెల్యో గోమెస్, డియెగో గిల్, జోర్జిన్హో, అమరాల్, లూసియో, అలెక్స్ ఫెరో, జూనియర్, జోవన్ని, విఓలా, మార్సెలో ఉన్నారన్నారు. ఇండియా ఆల్-స్టార్స్ జట్టులో మెహతాబ్ హొస్సేన్, అల్విటో డికున్హా, సయ్యద్ రహీం నబీ, సుభాషిష్ రాయ్ చౌదరి, మెహరాజుద్దీన్ వాడూ, షణ్ముగం వెంకటేష్, అర్ణబ్ మండల్, మహేష్ గవ్లి తదితరులు కలరన్నారు.
ప్రపంచ ఛాంపియన్లు భారతీయ ఫుట్‌బాల్ దిగ్గజాలతో పోటీపడుతున్న అరుదైన క్షణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చన్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం చెన్నై భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత ఫుట్‌బాల్ మైదానం అన్నారు. ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్ ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడటానికి భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు లభించిన అరుదైన అవకాశం అన్నారు. ఇది భారతీయ ఫుట్‌బాల్‌కు గొప్ప మైలురాయి అన్నారు. 2002 బ్రెజిల్ వరల్డ్ కప్ విజేతల జట్టును చెన్నైకి తీసుకురావడం, ఇండియా ఆల్-స్టార్స్‌తో పోటీ చేయించడంతో మా కల నెరవేరిందన్నారు. ఈ అపూర్వ అనుభూతిని భారత ఫుట్‌బాల్ అభిమానులకు అందించడం పట్ల గర్విస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రివాల్డో (బ్రెజిల్ 2002 ఫిఫా వరల్డ్ కప్ విజేత, బార్సిలోనా లెజెండ్) మాట్లాడుతూ మార్చి 30న నేను మీ అందరితో కలిసి ప్రత్యేక క్షణాలను పంచుకోవడానికి వస్తున్నానన్నారు. ఇది అద్భుతమైన అనుభవంగా మారబోతుందన్నారు. మీ అందరిని త్వరలో కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.
బ్రెజిల్ లెజెండ్స్ వెర్సస్ ఇండియా ఆల్ స్టార్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్స్ విక్రయాలు
– బుక్ మై షోలో ఈనెల 2వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి..