Friday, August 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -

మండల ప్రత్యేక అధికారి.వై. విజయ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి వై.విజయ్ కుమార్ సూచించారు. బుధవారం మండల కేంద్రమైన తాడిచర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్షించారు.ఈ సందర్భంగా వైద్యులు,సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు.రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  చూడాలన్నారు.సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల కొరత లేకుండా చూడాలన్నారు.అనంతరం రోజువారీ రికార్డులు తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి వినయ్ భాస్కర్,పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున  రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -