- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అవకతవకలపై విచారణను ఏసీబీకి అప్పగించాలా? లేదా సిట్ ను ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం వ్యవహారంపై BRS ను నిలదీయాలని మంత్రివర్గం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -