- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీలో సోమవారం ఈజీఎస్ సామాజిక తనిఖీ గ్రామ సభను నిర్వహించారు. పంచాయతీ ఈవో రాహుల్ మాట్లాడుతూ.. 2024 -25 సంవత్సరంలో మేజర్ గ్రామపంచాయతీలో జరిగిన ఈజీఎస్ పనులపై తనిఖీ బృందం సభ్యులు తనిఖీలు చేశారు. ఆ నివేదికను ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. ఈనెల 5న మండల కేంద్రంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఉంటుందన్నారు… కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు ఈజీఎస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -