కార్మికులకు మద్దతు తెలిపిన ధర్మసమాజ్ పార్టీ

నవతెలంగాణ- తాడ్వాయి
కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని పారిశుధ్య కార్మికులకు మద్దతు తెలిపిన ధర్మ సమాజ పార్టీ మండల నాయకులు ఇట్టి కార్యక్రమంలో తాడ్వాయి మండల ధర్మసమాజ పార్టీ ప్రచార కమిటీ నాయకులు నితిన్ మహారాజ్ భాస్కర్ మహారాజ్ రాజశేఖర్ మహారాజ్ పాల్గొన్నారు. మండల అధ్యక్షులు బాబు సాయికుమార్ మారాహాజు మాట్లాడుతూ.. 16వ రోజు కార్మికుల సమ్మెలో పాల్గొని జీవో 60 ప్రకారం కార్మికులందరికీ జీతాలు మరియు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ భీమా సౌకర్యం ప్రతి కుటుంబానికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామాల్లో పరిశుద్ధ కార్మికులు లేకపోవడం వల్ల దుబ్బరమైన వాసన వెదజల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామాల్లో మల్టీపర్పస్ కార్మికుల విధానం రద్దు చేయాలని కోరారు. వాటర్ మిలన్ పారిశుద్ధ కార్మికులు వారి వారి విధుల్లోనే ఉండాలని కోరారు. కార్మికులందరికీ డిమాండ్ చేయడం జరిగింది. 4 నెలల నుండి జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులందరికీ ధర్మ సమాజ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మండల నాయకులు బాబు సాయికుమార్ మహారాజ్ నితిన్ మహారాజ్ రాజశేఖర్ మహారాజ్ భాస్కర్ మహారాజ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలపడం జరిగింది.

Spread the love