
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకోవాలని రామేశ్వరపల్లి గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి తెలిపారు. గురువారం గ్రామంలో అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మద్ది చంద్రకాంత్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.