వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

నవతెలంగాణ -గంగాధర : గంగాధర మండల హిమ్మత్ నగర్ గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరిన బాధిత కుటుంబాలకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసర సరుకులు పనికి రాకుండా పోయాయని, ఈ దృష్ట్యా బాధిత కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్ రెడ్డి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ హిమ్మత్ నగర్ గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరి ఆస్తి నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సాయంగా రూ. 20 వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఆస్తి నష్టం, ఇళ్లు కూలిపోయిన బాధితులకు గృహలక్ష్మీ పథకం వర్థింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, మండల అధ్యక్షుడు కోల అశోక్, మండల ప్రధాన కార్యదర్శి రేండ్ల శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి సర్వ శ్రీనివాస్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల ప్రణయ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఆకుల మనోహర్, బీజేపీ నాయకులు వడ్నాల రాజు, తదితరులు పాల్గొన్నారు
Spread the love