– కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
ఆత్మరక్షణ కోసం విద్యార్థినులు, యువతులు కరాటే నేర్చుకోవాలని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ఇటీవల జరిగిన కరాటే పోటీల్లో బాలానగర్ డివిజన్‌కు చెందిన విద్యార్థులు టి.చేతన, వి.కీర్తన, ఎం.భవితలను ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈసందర్భంగా కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం విద్యార్థినీ, విద్యార్థులు కరాటే విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. ప్రతి రోజు ఏదో ఒక చోట మహిళలపై లైంగికదాడి, యాసిడ్ దాడులు జరుగు తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించి అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా సహకరించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన మాస్టర్ మురళీ ముదిరాజ్‌ను కార్పొరేటర్ అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు డివిజన్ కార్యదర్శి ప్రధాన మహమ్మద్ ఖాజా, దేవులపల్లి కష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, స్వామి గౌడ్, రామచంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.