నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో శివాజీ బీడీ కంపెనీకి చెందిన 49 మంది టేకదార్లు తెలంగాణ బీడీ అండ్ షిగర్ వర్కర్స్ మంగళవారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ అనేక రోజుల నుండి తేకదారులందరూ కంపానితో పాటు మేనేజ్మెంట్ లతో అనేక సమస్యలు ఎదుర్కొంటూ అతి తక్కువ కమిషన్ తో కార్ఖానా నడిపిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీడీ టేకర్లందరికి జీవన భృతి తో పాటు ప్రత్యేకమైన జీవో తెస్తూ టే కదారులకు కమిషన్, ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కర్రోల్ల సత్యం, బిడిటేకాదారులు నరహరి, భూపాల్, లక్ష్మణ్, శేఖర్, సచిన్, శివానందం, రమేష్, నర్సింలు, పోచయ్య, లక్ష్మీపతి, నర్సింలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.