
నవతెలంగాణ పెద్దవంగర: సామాజిక సేవ దృక్పథంతో గ్రామాల్లో బాలవికాస స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు గొప్పవని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప్పరగూడెం సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య అన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన శ్రీలక్ష్మి హాస్పిటల్ సాకారంతో డాక్టర్ గోవర్ధన్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ..సమాజ సేవలో బాల వికాస సంస్థ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బాలవికాస ప్రధాన కోఆర్డినేటర్ మద్దెల రమ, కోఆర్డినేటర్లు శోభ, సరిత, మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది నజీర్, మాధవి, వినీష్, గ్రామస్తులు పాల్గొన్నారు.