- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మంజీరా నది ప్రాంతం నుండి అక్రమ ఇసుక లోడుతో బొలెరో వాహనం వెళ్తుందనన్న నమ్మదగిన సమాచారం మేరకు .. డోంగ్లి తహసిల్దార్ ఆదేశాల మేరకు లింబూర్ గ్రామంలో పట్టుకోవడం జరిగిందని తహసిల్దార్, ఆర్ఐ సాయిబాబా తెలిపారు. ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రం లేనందున సీజ్ చేశామని తహసిల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -